Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మూడో టీ20లో కౌల్‌కు చోటు

Siddarth Kaul

ముంబయి: విండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆతిథ్య భారత జట్టు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఆఖరిదైన మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేష్ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రాలతో పాటు చైనామన్‌ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు సిద్దార్థ్‌ కౌల్‌కు జట్టులో చోటు కల్పించారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) శుక్రవారం ట్వీట్‌ చేసింది. కౌల్‌ టీమిండియా తరఫున ఇప్పటి వరకు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్‌ 21 నుంచి ప్రారంభమయ్యే ఆసీస్ పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు సమాచారం.

Siddarth Kaul Joins Team India for 3rd T20I

Telangana Breaking News

Comments

comments