Search
Thursday 15 November 2018
  • :
  • :

ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్..!

 

Siddharth Shukla was taken into custody after his BMW Crashes into 3 Cars

ముంబయి: ప్రముఖ బుల్లితెర నటుడు సిద్ధార్థ్ శుక్లాను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బిఎండబ్ల్యూ కారును ర్యాష్ గా నడిపి మూడు కార్లను ఢీకొట్టడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ముంబయి సమీపంలోని ఒషివారా ప్రాంతంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సిద్ధార్థ్ పై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు), బబుల్ కా అంగన్ ఛుటే న వంటి సిరీయల్స్ తో పాటు హాంప్టీ శర్మ కా దుల్హానియ, తాజాగా విడుదలైన సూర్మ మూవీలోనూ నటించారు.

Comments

comments