Home మెదక్ రాష్ట్రంలోనే సిద్దిపేటను ఆదర్శంగా చేస్తాం

రాష్ట్రంలోనే సిద్దిపేటను ఆదర్శంగా చేస్తాం

సమన్వయంతోనే అద్భుత ఫలాలు
ప్రజలకు మెరుగైన సేవలకే కొత్త జిల్లాలు
సిఎం లక్ష సాధనకు ప్రతి ఉద్యోగి  కష్టపడాలి
సిఎం లక్ష సాధనకు పాటు పడతాం
మన తెలంగాణ ఇంటర్వూలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి
సిద్దిపేట నుంచి మనుబ్రహ్మ మధుసూదనాచారి

collector1మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలన వ్యవస్థ పటిష్టవంతంగా వుండాలంటే ఆదిలోనే జిల్లా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేయాల్సి వుంటుందని, అలాంటప్పుడే అద్భుతమైన ఫలితా లు సాధ్యమవుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రారంభంలో ఏమాత్రం నిర్లక్షం చేసినా భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు, ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతోనే సిఎం చంద్రశేఖర్‌రావు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశా రని తెలిపారు. సిఎం అనుకున్న లక్షం సాధించాలంటే ప్రతి ఉద్యోగి సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని పిలుపుని చ్చారు. అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేస్తే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సిఎం కెసిఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావులు ఇదే జిల్లాకు చెందిన వారు కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకట్‌రాం రెడ్డిని మన తెలంగాణకు ఇంటర్వూ ఇచ్చారు.
మన తెలంగాణ : జిల్లాలో ప్రభుత్వ కార్యాల యాలు, వసతులు ఎలా ఉన్నాయి? అధికారులు, సిబ్బంది వారి విధుల్లో చేరారా?
కలెక్టర్ : దసరా రోజు నుంచే కొత్త జిల్లాలు ప్రారంభమ య్యాయి. అప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పా టు చేశాం. ఏ ఒక్క కార్యాలయం కూడా ప్రైవేట్ భవనంలో లేకుండా అన్ని కార్యాలయాలు ప్రభుత్వ భవ నాల్లోనే ఏర్పాటు చేశాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆయా శాఖల అధికారులు విధుల్లో చేరారు. అన్ని శాఖల అధికా రులతో సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం దశా నిర్దేశం చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులను సమన్వ యం చేసి సమగ్రాభివృద్ధి కోసం పాటు పడుతున్నాం.
మ. తె. : సిద్దిపేట జిల్లాలో సామూహిక కలెక్టరేట్ కాంప్లెక్స్‌తో పాటు, ఇతర కార్యాయాల నిర్మాణం కోసం స్థలం ఎంపిక చేశారా?
కలెక్టర్ : గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద సిఎం కెసిఆర్ ఇటీవల కలెక్టరేట్ నిర్మాణం కోసం పరిశీలించినా ఆ స్థలం విషయంలో ఇంకా స్ఫష్టత రాలేదు. కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలన్నీ ఒకే సముదాయంలో వుండేలా భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వ భవనాలు ప్రజలకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటున్నాం. సిఎం కెసిఆర్ ఎంపిక చేసిన స్థలంలోనే కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం
జరుగుతుంది.
మ.తె. : సిఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లోని ఎర్రవల్లి, నర్సన్నపేటలలో మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణమవుతున్నాయి. ఎప్పుటిలోగా పూర్తవుతాయి?
కలెక్టర్ : గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట లలో డబుల్ బెడ్ బెడ్ రూం ఇళ్లు దాదాపు పూర్తి దశకు చేరుకుంది. మరో పక్షం రోజుల్లో గృహ ప్రవేశాలు జరుగుతాయి. దీంతో పాటు సిద్దిపేట నియోజ కవర్గంలో రెండువేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయి.
మ.తె. : కొత్త జిల్లా ప్రజలతో, అధికారులను ఎలా సమన్వయం చేస్తున్నారు?
కలెక్టర్ : కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి కొత్తగా నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో కలిశాయి. వారు సిద్దిపేట జిల్లా వాసులమనే భావన వారిలో ముందుగా తీసుకువచ్చేందుకు, అధికారులను క్షేత్రస్థాయిలో పంపి అక్కడి ప్రజలతో మమేకం కావడానికి చర్యలు తీసుకుంటు న్నాం. అలాగే చేర్యాల, మద్దూరు మండలాలు చాలా వెనుకబడిన మండలాలు. ఆయా మండలాల ప్రజలకు కావాల్సిన వసతులు, సౌకర్యాలతో పాటు ప్రభుత్వ పథకా లు అందించేందుకు, ఆయా మండలాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటాం.
మ.తె. : కొత్త జిల్లాలో ఇటు కొత్త భవనాల నిర్మాణం, అటు అధికారులు బాగా పనిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?
కలెక్టర్ : కొత్త జిల్లాలో శాశ్వత భవనాల నిర్మాణం చేప ట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సిద్దిపేట రాష్ట్రం లోనే ప్రసిద్ది చెందినందున అన్ని జిల్లాల కంటే ఆదర్శంగా నిలి పేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశా లు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షలు జరుపుతున్నాం. ఇక నుంచి ప్రతి వారంలో మూడు రోజులు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాల ని అధికారులకు ఆదేశించాం. క్షేత్రస్థాయిలో ప్రజా సమ స్యలు పరిష్కరించినట్లయితే అభివృద్ధిలో ముందంజలో వుంటామని అధికారులకు ఎప్పటికప్పుడు సూచిస్తు న్నాం. ఏదిఏమైనప్పటికీ సిఎం కెసిఆర్ లక్ష సాధన కోసం అహర్నిశలు కృషి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

మ.తె. : మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? 

కలెక్టర్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో దాదాపు 700 ఎకరాల భూమిని 2013 చట్టం ప్రకారం సేకరించేందుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. త్వరలో మొత్తం భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. త్వరలో పూర్తవుతుంది.