Home జాతీయ వార్తలు ఆ చావ్లా ఎవరో నాకు తెలియదు: సిద్ధూ

ఆ చావ్లా ఎవరో నాకు తెలియదు: సిద్ధూ

sidhu

అమృత్‌సర్: కొత్త వివాదంలో చిక్కుకున్న పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ తనతో ఫోటో దిగిన వ్యక్తి ఎవరో తెలియదని స్పష్టం చేశారు. సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోరే ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సిద్ధూ కర్తార్‌పూర్‌లో బుధవారం కలసి ఉన్న ఫోటో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనిపై పెద్ద సంఖ్యలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. గురువారం పంజాబ్ చేరుకున్న సిద్ధూ అసలు ఆ గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తెలియదుని చెప్పారు. పాకిస్తాన్‌లో దాదాపు 5,000 నుంచి 10,000 ఫోటోలు తనవి తీసి ఉంటారని, గోపాల్ చావ్లా ఎవరో తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.

Sidhu Says He Dont Know Gopal Chawla