Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఉపాధి కూలీల కలెక్టరేట్ ముట్టడి

 Siege of collectorate on employment issues

నీలగిరి : అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం కూలీలకు పంపించిన వెయ్యి కోట్ల రూపాయలు తాను ఇష్టం వచ్చినట్లుగా కాంట్రాక్టు పనులకు వాడుకోవడం జరుగుతుందని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి హెచ్చరించారు. సోమవారం ఉపాధి కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎర్రటెండలను లెక్కచేయక, జిల్లా నలుమూలల నుండి ఉపాధి మహిళ కూలీలు వేలాది మంది ఇట్టి కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నారు. వారం రోజుల్లో కూలీల డబ్బులు పోస్టాఫీసుల్లో వారి ఖాతాలో పడకపోతే మంత్రులు, ముఖ్యమంత్రుల ఎటువంటి కార్యకలాపాలనైనా అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్.శ్రీనివాస్, నీలకంఠ, నరేష్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments