Search
Monday 24 September 2018
  • :
  • :

పాక్‌లో సిక్కు బాలిక ‘పది’ టాపర్

pak-Sikh-girl_manatelanganaలాహోర్ : పాకిస్తాన్ పదో తరగతి పరీక్ష లలో మైనారిటీ సిక్కు వర్గానికి చెందిన 15 ఏళ్ల బాలిక టాపర్‌గా నిలిచింది. పంజా బ్ ప్రావిన్స్‌లోని నంకాన గ్రామానికి చెం దిన మన్‌బీర్ కౌర్ వెయ్యికి పైగా మార్కు లు సాధించి ఈ ఘ నత సాధించిన తొలి మైనారిటీ వర్గ విద్యార్థి నిగా చరిత్ర సృష్టించింది. మొత్తం 1100 మార్కులకు గాను మన్ బీర్ కౌర్ 10౩5 మార్కులను సాధించింది. పదో తరగతి పరీక్షలలో ప్రథము రాలిగా నిలిచిన మన్‌బీర్ వారి వర్గానికి గర్వకారణమైం దని, ఆ వర్గానికి ఇది ప్రోత్సాహకంగా నిలుస్తుందని పంజాబ్ అసెంబ్లీ సభ్యురాలు మేరీ గిల్ వ్యాఖ్యానించారు. మన్‌బీర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం పంజాబ్ ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందజే స్తుందని, ఆమె కు ఇష్టమైన విద్యాసంస్థలో చదువుకోవచ్చని పాలకపక్ష సభ్యురాలైన మేరీ గిల్ తెలిపారు. మైనారిటీ వర్గ విద్యార్థుల సంక్షేమంకోసం రూ.20 మిలియన్ల నిధిని కేటాయించామని, మైనారిటీ వర్గాల అభివృద్ధికి మొత్తం 1 బిలియన్ రూపా యలను కేటాయించా మన్నారు. పాకిస్తాన్ సిక్కు బాలికలు బాలుర కంటె మెరుగ్గా రాణిస్తున్నారని, బాలురు ఇంటి పోషణపై చూపిన శ్రద్ధ చదు వుపై చూపించడంలేదని ఆమె వ్యాఖ్యానించారు. కాగా మన్‌బీర్ తండ్రి గియాని ప్రేమ్ సింగ్ తన కుమార్తె ఘనతకు ఉప్పొంగిపోయాడు. ఆమె రోజుకు 12 గంటలపాటు చదివేదని, అందుకు తగ్గ ఫలితం లభించిందన్నాడు.

Comments

comments