Home తాజా వార్తలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని

Bonalu2

హైదరాబాద్: లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. సింహవాహిని అమ్మవారికి భక్తులు తొట్టెలు, బోనాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి దానం నాగేందర్, జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నేత జానారెడ్డి, టిడిపి నేత దేవేందర్ గౌడ్, మంత్రి లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.