Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అదరగొట్టే ‘సిల్లీ ఫెల్లోస్’ వినోదం

sunil

అల్లరి నరేశ్, సునీల్, చిత్ర శుక్ల హీరోహీరోయిన్లుగా బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘సిల్లీ ఫెల్లోస్’. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ప్రకటన కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాస్ మాట్లాడుతూ “అల్లరి నరేశ్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘సుడిగాడు’ బిగ్ హిట్ అయింది. మళ్లీ మా కాంబినేషన్‌లో ‘సిల్లీ ఫెల్లోస్’ వస్తోంది. సునీల్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తాడు.  చిత్ర శుక్లా చక్కగా నటించింది. ఒక సంవత్సరం పాటు కష్టపడి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో వస్తున్నాం”అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన భరత్ చౌదరి మాట్లాడుతూ “సినిమా షూటింగ్ పూర్తయింది. నేనే రాజు నేనే మంత్రి, ఎంఎల్‌ఎ చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న మూడవ చిత్రమిది. ఈ సినిమాతో తప్పకుండా హ్యాట్రిక్ హిట్స్ కొడతామని నమ్మకంగా ఉన్నాం”అని చెప్పారు. సునీల్ మాట్లాడుతూ “ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమా షూటింగ్ పూర్తిచేశాం. ఈమధ్య అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు రావడం లేదు. భీమినేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు”అని పేర్కొన్నారు. అల్లరి నరేశ్ మాట్లాడుతూ “సుడిగాడు వంటి హిట్ సినిమా తర్వాత భీమినేనితో నేను చేసిన ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కింది. సునీల్‌తో కలిసి చేసిన ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది”అని  చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర శుక్లాతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments