Search
Wednesday 14 November 2018
  • :
  • :

సింపుల్ లవ్ స్టోరీ

Paper-boy

సంపత్‌నంది టీమ్ వర్క్ బ్యానర్‌లో జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది నిర్మిస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్‌ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ “సింపుల్ లవ్ స్టోరీ ఇది. ఒక అమ్మాయి, పేపర్‌బాయ్‌కు మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సౌందర్య రాజన్ మంచి విజువల్స్ అందించారు. బీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది”అని అన్నారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ “నేను చేసిన షార్ట్‌ఫిల్మ్ చూసి సంపత్‌నంది నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ ప్రేమ కథా చిత్రం ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని తెలిపారు. హీరో సంతోష్ మాట్లాడుతూ “గోల్కొండ హైస్కూల్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఇప్పుడు ‘పేపర్‌బాయ్’ చిత్రంతో హీరోగా వస్తున్నాను. ఈ సినిమాలో అందరూ కొత్తవారే. సినిమాకు హైలైట్ సినిమాటోగ్రఫీ. మ్యూజిక్ కూడా బెస్ట్‌గా నిలుస్తుంది. రియా బాగా నటించింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రియా, నరసింహ, అభిషేక్ మహర్షి, రాజశ్రీ, దివ్య, మురళి, మహేష్ మిట్టల్, సన్నీ పాల్గొన్నారు.

Comments

comments