Search
Friday 21 September 2018
  • :
  • :

గురువు గోపీపై సింధు డిజిటల్ ఫిల్మ్

sindhuహైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి.సింధు తన గురువు పుల్లెల గోపీచంద్‌పై ఓ డిజిటల్ ఫిల్మ్‌ను రూపొందించింది. టీచర్స్ డేను పురస్కరించుకొని సింధు ఈ వీడియోను తయారు చేసింది. హేట్ మై టీచర్ పేరుతో ఉన్న ఈ డిజిటల్ వీడియోను తన గురువు గోపీచంద్‌కు అం కితం చేస్తున్నట్టు చెప్పింది. స్వల్ప వ్యవధిలో సాగే ఈ షార్ట్ ఫిల్మ్‌లో సింధునే నిర్మాతగా మారింది. గోపీచంద్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడి యోలో క్లుప్తంగా వివరించింది. కోచ్‌గా ఆయన ఎంత కఠినంగా వ్యవహరి స్తారో ఈ వీడియో ద్వారా వెల్లడించింది. గోపీ అనుసరించే కఠిన వైఖరి వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని సింధు అభిప్రాయపడింది.

Comments

comments