Search
Monday 24 September 2018
  • :
  • :

ఫైనల్లో సింధు

sindu

 దుబాయి ఓపెన్ సూపర్ సిరీస్

దుబాయి: తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ సంచలనం పివి.సింధు ప్రతిష్టాత్మకమైన దుబా యి ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత స్టార్ సింధు 2115, 2118 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యుఫిను చి త్తు చేసింది. ప్రారంభం నుంచే సింధు దూకుడు గా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా సాగింది. సింధు జోరుకు చైనా స్టార్ చెన్ ఎదురు నిలువలేక పోయింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సింధు చెలరేగి ఆడడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ప్రత్యర్థికి ఏమా త్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు సునాయాసంగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా సింధు హవా కొనసాగించింది. ప్రత్యర్థిని హడలెత్తిస్తూ ముందుకు సాగిం ది. తీవ్ర ఒత్తిడికి గురైన చెన్ అనవసర తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సింధు సఫలమైంది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, దుబాయి ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరిన నాలుగో భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఇంతకుముం దు సైనా నెహ్వాల్, గుత్తాజ్వాల, విడిజులు మా త్రమే దుబాయి ఓపెన్‌లో ఫైనల్‌కు చేరారు.

Comments

comments