Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

టైటిల్ పోరుకు సింధు

sindu

బ్యాంకాక్: భారత స్టార్ పి.వి.సింధు ధాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 2321, 1621, 219 తేడాతో ఇండోనేషియా క్రీడాకారిణి గ్రెగరియా మరిస్కాపై విజయం సాధించింది. ప్రారంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. అయితే తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. కాగా, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో భారత స్టార్ సింధుకు చుక్కెదురైంది. ప్రత్యర్థి క్రీడాకారిణి మరిస్కా చూడచక్కని షాట్లతో సింధును హడలెత్తించింది. ఇదే క్రమంలో సింధు ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న మరిస్కా సెట్‌ను సాధించింది. అయితే కీలకమైన మూడో సెట్‌లో భారత స్టార్ సింధు మళ్లీ పుంజుకుంది. ప్రారంభం నుంచే తన మార్క్ షాట్లతో చెలరేగింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు చిరకాల ప్రత్యర్థి, జపాన్ స్టార్ ఒకుహారాతో తలపడుతుంది.

Comments

comments