Home జాతీయ వార్తలు సింధూ ఒప్పందంపై పిటిషన్ కొట్టివేత

సింధూ ఒప్పందంపై పిటిషన్ కొట్టివేత

supreme-court

ఢిల్లీ : భారత్, పాక్‌ల మధ్య జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సింధూ జలాల ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని, ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. 1960 నాటి ఈ ఒప్పందం వల్ల సగానికి పైగా దేశానికి లాభం చేకూరుతోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.