Home తాజా వార్తలు బ్రిటన్ పురస్కారం అందుకున్న సింగరేణి సిఎండి

బ్రిటన్ పురస్కారం అందుకున్న సింగరేణి సిఎండి

Singareni CMD N sridharమన తెలంగాణ/కొత్తగూడెం: ఉత్పత్తి , ఉత్పాదకత, బొగ్గు రవాణాలోనే కాదు, అవార్డు పొందటంలోను అవికూడా అంతర్జాతీయ అవార్డులు సాధించటంలో సింగరేణి సంస్థ ముందుంది. తాజాగా శుక్రవారం బ్రిటన్ కుచెందిన అచీవ్‌మెంట్స్‌ఫోరం సంస్ధ మేనేజర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును లండన్‌లో సింగరేణి సిఎండి నడిమింటి శ్రీధర్‌కు ప్రదానం చేసింది. సింగరేణి సంస్థలు గత ఐదేళ్లలో అభివృద్ధి పధంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన సిఎండి శ్రీధర్‌కు బ్రిటన్‌కు చెందిన వృత్తి విద్యా నైపుణ్య, వినూత్న ఆలోచనల ప్రొత్సాహక వేదికైన అచీవ్‌మెంట్స్‌ఫోరం వారు ఈ అవార్డును అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే మేనేజర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును ఆయనకు బహూకరించారు.

శుక్రవారం ఏప్రిల్ 12వ తేదీ రాత్రి లండన్‌లోని ఇనిస్టిట్యూట్‌ఆఫ్ డైరెక్టర్స్ ప్రాంగణంలో జరిగిన ఫోరం 2019 సభావేదికపై గ్లోబల్ ఆఫ్ లీడర్స్ సంస్థ అధ్యక్షులు , ప్రతిష్టాత్మక బిజినెస్ అలయెన్సు (సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గ్రూప్ (వ్యవస్థాపకులు, న్యూవరల్డ్ ఇన్‌సైట్ సిఈఓ క్రిస్టినా బ్రిగ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈబివో (యూరప్ బిజినెస్ అలయెన్స్) ప్రొఫెసర్ జాన్‌నెట్టింగ్‌లు సింగరేణి సిఎండి శ్రీధర్‌కు అవార్డును, సైటేషన్‌ను బహూకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సిఎండి శ్రీధర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా సాధిస్తోన్న అధ్భుతమైన ప్రగతి, దీనికోసం అమలు చేస్తోన్న విధానాలు తదితర అంశాలు వెల్లడించారు.

సింగరేణిలో అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, సమష్టి కృషి , పట్టుదల వల్లనే సంస్థ ఈ స్థాయికి చేరుకోగలిగిందన్నారు. అంతకుముందు జర్మనీ దేశంలో మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ ప్రసిధ్ధిచెందిన ట్రేడ్‌ఫెయిర్ బవుమాలో ఆయన పాల్గొన్నారు. ఇండియాడే సింపోజియంలో శ్రీధర్ ముఖ్యవక్తగా పాల్గొని దేశంలోని బొగ్గు పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అనే అంశంపై ప్రసంగించారు. ఇందులో 58 దేశాల 3500 కంపెనీలు అత్యాధునిక మైనింగ్ సాంకేతికత, కొత్త యంత్రాలు, కొత్తసాధనాలు తమస్టాల్స్ ప్రదర్శించాయి.

ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ఆరు లక్షల మంది ప్రతినిధులు సందర్శించనున్నారు. ఇందులో ప్రదర్శించిన యంత్రాలు సింగరేణికి ఏ మేరకు ఉపయోగపడతాయో సిఎండితోపాటు మిగిలిన ప్రతినిధి బృందం పరశీలించారు. సింగరేణి సిఎండి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించటం పట్ల సింగరేణియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Singareni CMD N sridhar received Britain award