Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సింగరేణి సరికొత్త రికార్డు

Sridhar.N

హైదరాబాద్:  60.80 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి సింగ రేణి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదేవిధంగా కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద భారీ మొత్తంలో వెచ్చించి సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 2011-14 మధ్యకాలంలో కేవలం రూ.23.745 కో ట్లు ఖర్చు చేయగా, 2014-17 మధ్యకాలంలో రూ. 66.34 కోట్లు ఖర్చు చేశారు. గతంలో చేసిన ఖర్చుకు ఇది మూడు రెట్లు కావడం విశేషం. ఇదేవిధంగా తెలంగాణకు హరితహారంలో లక్షలాదిగా మొక్కలు నాటి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సింగ రేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యే క చొరవతో యోగా, హెల్త్ చెకప్, ఎక్స్‌గ్రేషియా పెం పు, ఉద్యోగాల నియామకం, ఇతరత్రా  సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. 5500 పోస్టుల భర్తీకి ప్రక్రి యలో వేగం పెంచింది సింగరేణి. నత్తనడక సాగుతు న్న జైపూర్ పవర్ ప్లాంట్‌కు రాష్ట్రం వచ్చాకే మోక్షం కలిగింది. పనిలో వేగం పెంచి, 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సమకూర్చారు సింగరేణి సిఎండి శ్రీధర్. దీనికి అదనంగా మరో 800 మెగావాట్ల ప్లాం ట్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇం దుకోసం ఒడిషాలోని నైని బ్లాకును కేంద్ర బొగ్గు శాఖ సింగరేణికి కేటాయించింది. 2015-16లో రూ. 302 కోట్లు దీపావళి బోనస్ రూపంలో, లాభాల్లో 23 శాతం వాటా  రూ.245 కోట్లు ఉద్యోగులకు కేటా యించారు. తెలంగాణ వచ్చాకే బొగ్గు ఉత్పత్తిలో, సర ఫరాలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. కొత్త రాష్ట్రాన్ని వెలుగుల తెలంగాణగా నిలిపే ప్రక్రియలో సింగరేణి పాత్ర కీలకంగా మారింది. 2016-17లో చేసిన బొగ్గు సరఫరాలో దాదాపు 83 శాతం వరకు ధర్మల్ పవర్ కేంద్రాలకే సరఫరా చేసింది.

Comments

comments