Search
Monday 19 November 2018
  • :
  • :

కాలుష్యంతో ముంచెత్తుతున్న సింగరేణి

MANUGURU 02-02p MANUGURU 02-01pఖమ్మం: మణుగూరు ప్రజలను సింగరేణి యాజమాన్యం కాలుష్యంతో ముంచెత్తుతుంది. మణుగూరు పట్టణానికి అతిసమీపంలో ఓసీ-4ఎక్స్‌టెన్షన్‌ను తీసుకువచ్చి స్థానిక గాంధీనగర్, భగత్‌సింగ్‌నగర్, శేషగిరినగర్ వాసులను ధుమ్ము,ధూళితో ముంచెస్తుంది. ఈ సమస్యపై స్థానిక ప్రజలు అనేక సార్లు సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడిచేసి తమ గోడును యాజమాన్యానికి విన్నవించుకుంటే, సమస్యను పరిష్కరిస్తామని పట్టణానికి, ఓసీకి మధ్య గ్రీన్‌బెడ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం గ్రీన్‌బెడ్ ఊసెత్తడమే మరచిపోయింది. ఈ ప్రాంత ప్రజలకు సాయంత్రం 3గంటలు అయిందంటే గుండెల్లో గుబులు మొదలౌతుంది. 3గంటలకు ఓసీ-4లో నిర్వహించే బ్లాస్టింగ్‌తో ఒకే సారి ఆకాంశంలోకి ధుమ్ము లేచి ఆ ధుమ్ము గాలితో పాటుగా పయనించి గాంధీనగర్, భగత్‌సింగ్‌నగర్, శేషగిరినగర్ మీద పడతుంది. ఇక్కడి బొగ్గుతో కోట్లు గడిస్తున్న సింగరేణి యాజమాన్యం ఇక్కడి స్థానిక నిరుద్యోగ యువతకు మాత్రం మొండిచెయ్యి చూపుతుంది. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగాలు కావాలని ఎవరూ కోరడం లేదు. కాని ప్రైవేటు కంపెనీలలోనైనా స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని ఎన్నో సార్లు కోరినా స్థానిక నిరుద్యోగుల మాటను సింగరేణి యాజమాన్యం పెడచెవిన పెడుతుంది.

Comments

comments