Home ఖమ్మం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సింగరేణి

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సింగరేణి

Singareni-blostings

ఖమ్మం: మణుగూరు సింగరేణి యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. మణుగూరు నుండి వెళ్ళే ప్రధాన రహదారికి అతి దగ్గరలో ఉన్న ఓసీ-04లో రోడ్డుకు అతి సమీపంలో బ్లాస్టింగ్‌లు నిర్వహించడం వలన బ్లాస్టింగ్‌లో పెద్ద పెద్ద రాళ్ళు, బొగ్గు పెల్లలు ఎగిరి రోడ్డుపైన పడుతున్నాయి. జనవాసాలు సంచరించే ప్రాంతానికి 600ల మీటర్ల దూరంలో బ్లాస్టింగ్‌లు నిర్వహించాలని నిబంధనలు ఉన్నా మణుగూరు సింగరేణి మాత్రం నిబంధనలను విరుద్దంగా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. బ్లాస్టింగ్‌లు నిర్వహించే సమయంలో రహదారిలో ఎవరు రాకుండా బ్లాస్టింగ్ అయిపోయే వరకు గతంలో ఆపేవారు. కాని నేడు ఆ జాగ్రత్తను కూడా తీసుకోవడం మణుగూరు సింగరేణి యాజమాన్యం మర్చిపోయింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న బ్లాస్టింగ్‌లలో రోడ్డుపై రాళ్ళు పడుతుంటే సింగరేణి అధికారులను అడిగినా మేము నిబంధనలకు అనుగుణంగానే బ్లాస్టింగ్‌లు చేస్తున్నామని అంటున్నారే కాని బ్లాస్టింగ్‌లు జనవాసాలకు అతి దగ్గరగా నిర్వహించడంతో దుమ్ము, ధూళీ పట్టణంలోకి చేరుకోని ప్రజల ఆరోగ్యాలను హరిస్తుంది. ఈ విషయంపై సింగరేణి యాజామన్యానికి ఎన్ని సార్లు విన్నవించినా పెడచెవిన పెడుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.