Home తాజా వార్తలు సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెని అవార్డు

సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెని అవార్డు

కొత్తగూడెం సింగరేణి: అత్యధ్భుతమైన వృధ్దితో దేశంలోనే ప్రభుత్వ రంగపరిశ్రమల్లో మొదటిగా నిలిస్తూ, పలు అవార్డులు అందుకున్న సింగరేణి కాలరీస్‌ కంపెని తాజాగా ఇండియాస్ బెస్ట్‌కంపెని అవార్డును సాధించింది. అమెరికాకు చెందిన ప్రముఖ జాతీయ వానిజ్య, వ్యాపార సంప్రదింపుల సంస్ధ బార్క్‌షైర్ మీడియా ప్రయివేట్‌ లిమిటెట్‌ వాళ్లు శుక్రవారం రాత్రి నిర్వహించిన జాతీయ స్ధాయి అవార్డుల ఉత్సవంలో సింగరేణికి ప్రకటించిన ఇండియాస్‌ బెస్ట్‌కంపెని అవార్డును సంస్ధ ఛైర్మన్ అండ్ ఎండి. ఎన్.శ్రీధర్ కు అందజేశారు. ముంబాయి లీలా హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు వందకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల వాళ్లు పాల్గొన్నారు. బార్క్‌షైర్ సిఈవో హేమంత్‌కౌశిక్, వైస్‌ప్రెసిడెంట్ ఎమిలివాల్ష్‌లు ఈ అవార్డు సంస్ధ ఎండి శ్రీధర్‌కు బహూకరిస్తూ.. దేశంలో సింగరేణి సంస్ధ అధ్భుతమైన ప్రగతితో అత్యంత వేగంగా అభివృధ్ది చేందుతున్న సంస్దల్లో మొదటిగా నిలిచిందని, దేశ అభివృధ్దికి తన విశిష్టమైన అభివృధ్ది ఆలోచనలతో దోహదపడుతున్న ప్రభుత్వ రంగ సంస్ధల్లో సింగరేణిని గుర్తించి, ఇండియా బెస్ట్‌కంపెని అవార్డుకు ఎంపిక చేశామన్నారు.

కార్యక్రమంలో అవార్డు గ్రహితగానే కాకుండా ముఖ్యఅతిధుల్లో ఒకరుగా పాల్గొన్న శ్రీధర్ మాట్లాడుతూ.. 13దశాబ్ధాల చరిత్ర గత సింగరేణి సంస్ధ గతంలో కొంత నిర్లక్ష్యానికి గురైనప్పటికి తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంస్ద అభివృధ్దికి అందించిన చక్కని సహకారం, ప్రొత్సాహంతో కంపెని అధ్భుత ప్రగతి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర దేశ విద్యుత్ అవసరాలు తీర్చడానికి సింగరేణిలో అధికారులు, కార్మికులు ఎప్పుడు అంకిత భావంతో సమిష్టిగా కృషి చేస్తు, లక్షాలను సాధిస్తున్నారన్నారు. 2013-14తో పోలిస్తే 17-18 ఆర్ధిక సంవత్సరం బొగ్గు రవాణాలో 34శాతం, బొగ్గు ఉత్పత్తిలో 22.9శాతం, లాభాల్లో 186శాతం వృధ్దిని సింగరేణి నమోదు చేసిందన్నారు. సమిష్టి కృషికి మారుపేరైన సింగరేణియులందరికి ఈ అవార్డు చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

Singareni wins India’s best company award 2019