Home తాజా వార్తలు మధుప్రియ తండ్రి అరెస్టు

మధుప్రియ తండ్రి అరెస్టు

TS-Police-Logoహైదరాబాద్: గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భ్రమపడి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తిపై దాడి కేసులో ఆమె తండ్రి పెద్ద మల్లేశ్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మల్లేశ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. కాగా గత శనివారం రాత్రి శ్రీకాంత్ అనుకుని రామాంతపూర్‌కు చెందిన మహ్మద్ నయీమ్‌ని మధుప్రియ తండ్రి, బంధువులతో కలిసి చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.