Search
Monday 24 September 2018
  • :
  • :

ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష

Engineering-Entrance

న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి రాష్ట్రాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటిఇ) దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించనుంది.

ఇది వైద్య కళాశాలల్లో ప్రవేశానికి గత ఏడాది నుంచి నిర్వహిస్తున్న నీట్ పరీక్ష మాదిరిగానే ఉందనుంది. ఇక ఐఐటిల్లో ప్రవేశం కోసం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష తర్వాత జెఇఇ అడ్వాన్స్‌లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. ఈ మేరకు మండలి ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

comments