Search
Sunday 23 September 2018
  • :
  • :

యా’పిల్‌‘తో సైనస్ మైనస్

Sinus

సైనస్ ఇన్ఫెక్షన్ లేదా సైనసైటిస్ అనేది ముక్కు పక్కన ఉండే సైనస్‌లలో వాపు, నొప్పి వల్ల ఏర్పడుతుంది. బాక్టీరియా కారక ఫ్లూయిడ్లు ఈ సైనస్‌లను మూసివేయడం వల్ల ముక్కు దిబ్బడ, నొప్పి కలుగుతుంది. దీనివల్ల ముఖం చుట్టూతా, ముక్కు, కండ్ల ప్రాంతంలో నొప్పి ఉండి తలనొప్పి వస్తుంది. ముక్కు దిబ్బడతో పాటు ముదురు పసుపురంగులో ఉండే తెమడ ముక్కునుంచి కారుతుంది. ఒక్కోసారి ఇది పెరిగిపోయి జ్వరం, దగ్గుకు దారితీస్తుంది. నేడు అనేక రకాల మందులు అందుబాటులోకి వచ్చినా అవి సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా సమస్యలు తలెత్తడం వంటివి వీటివల్ల ఏర్పడతాయి. అందుకే ఇంట్లోనే వంటింటి వస్తువులతో మందును తయారుచేసుకుంటే బాధే లేదు. దీనికి కావాల్సిందల్లా యాపిల్ సైడర్ వెనిగర్.
యాపిల్ సైడర్ వెనిగర్ : అధికమొత్తంలో ఉండే విటమిన్లైన ఇ, ఎ, బి1, బి2, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి సైనస్ ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తాయి. మ్యూకస్‌ను పల్చగా చేసి ముక్కురంధ్రాలు మూసుకుపోకుండా చేస్తుంది. దీన్లో అధికమొత్తంలో ఉండే ph స్థాయిలు మ్యూకస్‌ను విడగొట్టి శ్వాసనాళాలు తెరుచుకునేలా చేస్తాయి. యాసిడ్ లక్షణాలున్న యాపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున బ్యాక్టీరియాపై దాడి చేసి నశింపజేస్తుంది. ఇన్ఫెక్షన్ తిరగబెట్టే బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలిస్తుంది.

ఎలా వాడాలి : ప్రతిరోజూ ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను మూడుపూటలా తీసుకున్నట్లైతే సైనస్‌తో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

  • పాలిచ్చే తల్లులు దీన్ని నేరుగా తీసుకోకపోవడం మంచిది.

స్టీమ్(ఆవిరి) : యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఆవిరి పట్టడం వల్ల సైనస్‌తో బాధపడేవారు త్వరగా రిలీఫ్ పొందొచ్చు. అరకప్పు నీళ్లల్లో అరకప్పు యాపిల్‌సైడర్ వెనిగర్ వేసి ఆవిరిపట్టాలి. ఈ ఆవిరి శ్వాసనాళాలను శుభ్రపరిచి అక్కడ ఏర్పడిన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. సైనస్‌నుంచి ఉపశమనం పొందడానికి సహజసిద్ధమైన ఈ పద్ధతి ప్రభావవంతంగా పనిచేస్తుంది.
రెండు టేబుల్‌స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టేబుల్‌స్పూన్ తేనె, గోరువెచ్చటి నీళ్లలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సహజసిద్ధ యాంటీ బ్యాక్టీరియల్ అయిన తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌తో నాజల్ స్ప్రే తయారుచేసుకొని వాడవచ్చు. ఒక టేబుల్‌స్పూన్ డిస్టిల్డ్ వాటర్‌లో ఐదు నుంచి ఆరు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి స్ప్రేయర్‌లో పోసి వాడుకోవచ్చు.
సైనస్‌తో ఇబ్బందిపడేవారు ఈ చిట్కాలు పాటించొచ్చు :

  • మంచినీళ్లు తరచూ తాగడం వల్ల గొంతులో పేరుకుపోయిన మ్యూకస్ తొలిగిపోతుంది.
  • విటమిన్ ఎ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇది సైనస్‌తో పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
  • సైనస్ సమస్య వేధిస్తూంటే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.
  • ముక్కు రంధ్రాలు పొడిబారకుండా చూసుకోవడం అవసరం.

Comments

comments