Search
Friday 21 September 2018
  • :
  • :

చైనాకు వెళ్తున్న ‘సైరా..’

chiru

ఓ సినిమాను మార్కెట్ చేసుకునేందుకు చాలానే టెక్నిక్స్ పాటించాలి. అందులో భాగమే  ఇతర భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేయడం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా.. నరిసింహారెడ్డి’ని దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేలా పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ‘సైరా…’ను చైనాకు కూడా తీసుకెళ్లాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించారు. అందుకు తగినట్లుగానే షూటింగ్ పనులు కూడా ప్లాన్ చేయడం విశేషం. ఇతర దేశాల భాషలకు చెందిన సినిమాను చైనాలో విడుదల చేయాలంటే అక్కడ ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఆ సినిమాలోని కొంత భాగాన్ని చైనాలో షూట్ చేస్తే ట్యాక్స్ రిబేట్స్ కూడా ఉంటాయి. అందుకే సైరా మూవీకి చెందిన ఓ షెడ్యూల్‌ను చైనాలో చిత్రీకరించబోతున్నారట. ఇక మరికొన్ని రోజుల్లో అమితాబ్‌బచ్చన్ ఈ సినిమా షూటింగ్‌లో  పాల్గొనబోతున్నారు. ఆయన షెడ్యూల్ తర్వాత పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతుంది. ఆతర్వాత షెడ్యూల్‌ను మాత్రం పూర్తిగా చైనాకే కేటాయించారట. చైనీయుల సినిమా, అక్కడ ఉన్న వేల థియేటర్లు… ఈమధ్య కాలంలో ఇండియన్ సినిమాలకు అక్కడ పెరుగుతున్న ఆదరణ… ఇవన్నీ గమనించి సైరా చిత్రాన్ని చైనాకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచేందుకు ఫిల్మ్‌మేకర్స్ అన్నివిధాలా ప్లాన్ చేస్తున్నారు.

Comments

comments