Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మక్కాలో సిరిసిల్ల వాసి మృతి

Mecca-Masjid

సిరిసిల్ల: ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైన దర్శించుకోవాలనుకునే మక్కా మదీనాలో సిరిసిల్లకు చెందిన మహిళ గుండెపోటుతో మరణించింది. రా జన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లకు చెందిన అహ్మదిబేగం అనే మహిళ మక్కా మదీనాలో దర్శనం ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణమవుతున్న తరుణంలో గుండెపోటుతో మరణించిన సంఘటన పట్టణ ంలో కలకలం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల ప ట్టణంలోని పోస్టాఫీస్ రోడ్డు వద్ద నివాసముండే అహ్మది బేగం అనే మహిళ తన స్నేహితురాలితో కలిసి మక్కా యాత్రకు పదిరోజుల కిత్రం వెళ్లింది.

మక్కా మదీనాలో దర్శనం ముగించుకుని ఆదివారం సాయంత్రం బయల్దే రాల్సి ఉండగా ఇంతలోనే అహ్మదిబేగంకు తీవ్ర గుండె నొప్పి వచ్చింది. గుండెనొప్పి అధికం కావడం వల్ల అహ్మదిబేగం అక్కడికక్కడే మృతి చెందినట్లు అహ్మదిబేగంతో ఉన్న ఆమె స్నేహితురాలు సిరిసిల్ల పట్టణంలోనే ఉన్న కుటుంబ సభ్యులకు వెల్లడించింది.  అహ్మదిబేగం మృతితో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మక్కా మదీనా నుండి అహ్మదిబేగం మృతదేహాన్ని తరలి ంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Comments

comments