Home కరీంనగర్ సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ర్యాలీ, ధర్నా

సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ర్యాలీ, ధర్నా

farmers-do-protes1

*కరువు మండలంగా ప్రకటించాలి… 

*50 సంవత్సరాలు నిండిన రైతులకు పెన్షన్ మంజూరు చేయాలి…
*సిరిసిల్లను కరువు మండలంగా ప్రకటించాలి…
కరీంనగర్‌ః వర్షాలు లేక బావులు, బోర్లు ఎండిపోయి పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, పంటల కోసం చేసిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ శనివారం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆర్‌డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. సిరిసిల్లను కరువు మండలంగా ప్రకటించి రైతులకు రుణమాఫీ ఒక్క దఫాలో ప్రకటించాలనీ, సమగ్రసర్వే ప్రకారం పేదరికంలో ఉన్న అన్ని కులాల ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మీ పథకం అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఎరువులు విత్తనాలు సబ్సిడీపై అందించాలని, 50 సంవత్సరాలు నిండిన రైతులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరెడ్డి వెంకటరెడ్డి, దేవరాజు, పాతూరి సత్యంరెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.