Search
Wednesday 19 September 2018
  • :
  • :

పని చేతగాకపోతే ఇంట్లో కూర్చొండి !

అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్

మరుగుదొడ్ల నిర్మాణ పనులకు జిల్లాకు మరో రూ. 21కోట్లు

Collector

రాయికల్: గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణ పను ల టార్గెట్ మీరిచ్చిందే, మీరిచ్చిన లక్షాన్ని పూర్తి చేయకుండా తమాషాలు చే స్తున్నారు? పనులను తీవ్రంగా నిర్లక్షం చేస్తున్నట్లు కనబడుతుంది, పని చేత గాకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మం డల స్థాయి అధికారులపై సీరియస్ ఆయ్యారు. రాయికల్ మండల పరిషత్ కా ర్యాలయ ఆవరణలో శనివారం మరుగుదొడ్ల నిర్మాణ పనులు, హరిత హారం పనుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించి మరుగుదొడ్ల నిర్మాణపనులపై గ్రామాల వారీగా సమీక్షించారు.

గ్రామ స్థాయి ప్రత్యేకాధికారులు, కార్యదర్శు లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపిడిఒ, తహసీల్దార్, ఆర్‌డబ్లుస్ ఎఇలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోనే మండలం పనితీరు ఆశించిన స్థాయి లో లేదని హీనస్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. క్షేత్రస్థాయిలో విధుల ను నిర్లక్షం చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని ఎంపిడిఓను ఆదేశిం చారు. ప్రతి గ్రామంలో లబ్ధిదారులను చైతన్యపరిచి వంద శాతం మరుగదొడ్లను 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా తయారుకావాలన్నారు. 6లోగా ఏ గ్రామంలో మరుగుదొడ్లు ప్రా రంభం కాకుండా ఉండకూడదని, అలా ఉంటే ఎంపిడిఒ, గ్రామ ప్రత్యేకాధికా రి, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

టెక్నికల్ ఇబ్బం ది, ఆన్‌లైన్ సమస్య అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిం చారు. గ్రామాల్లో పూరైన మరుగుదొడ్లను ఫోటోలు తీయించి ఆన్‌లైన్‌లో న మోదు చేయాలని ఇజిఎస్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మరుగుదొడ్ల ని ర్మాణ పనులకు నిధుల కొరత లేదని జిల్లాకు మరో రూ.21 కోట్లు రానున్నట్లు చెప్పారు. హరితహారం పథకం ద్వారా మొక్కలు నాటేందుకు అనువైన స్థలా లను గుర్తించాలని తెలుపుతూ ఇదివరకు నాటిన మొక్కల్లో ఎండిన వాటి స్థలం లో కొత్త మొక్కలను నాటాలని సూచించారు. గ్రామాలవారీగా,శాఖాల వారీగా లక్షం నిర్ణయించుకొని మొక్కలను నాటి వాటి రక్షణకు తగు చర్యలు తీసు కోవాలన్నారు.

మొక్కల రక్షణకు నీటిని పోయడానికి వాటర్‌మెన్‌ను ఉపయో గించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపిపి పడాల పూర్ణిమా, జెడ్పిటిసి గోపి మాధవి, జిల్లా ప్రత్యేకాధికారులు కిషన్‌స్వామి, రమేష్. తహసీల్దార్ చంద్రప్ర కాశ్, ఎంపిడిఒ మచ్చ గీత, ఎఇలు ఆనంద్, ఆధిత్య,ఇజిఎస్ ఎపిఒ కొంరయ్య, ఎంసిఓ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగ ఇటీవల భూపతిపూర్ గ్రా మంలో రికార్డు స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణంలో పాలుపంచుకొని చురుకు గా పని చేసిన సాక్షరత్ భారత్ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఐకెపి సిబ్బంది, ఇతర మండల స్థాయి అధికారులకు ప్రశంసపత్రాలు అందజేశారు.

Comments

comments