Home Default ‘నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి’

‘నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి’

 

హైదరాబాద్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగర్వాల్ రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’.ఈ చిత్రినికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ పాత్రను ప్రధానంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ ను చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. ‘నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే..నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి అనే డైలాగ్ తో పాటు ఇంత కంత్రి పిల్లకి ఆ పేరు పెట్టారేమిటా అనుకున్నా.. ప‌క్క‌న శ్రీరాముడున్న సంగ‌తి అర్ధం కాలేదు వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ మరో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు మాటలు రాయగా.. శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

 

Sita movie teaser release