Search
Friday 21 September 2018
  • :
  • :

మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి స్టెప్పులు

Nayanthara Kolamavu Kokila

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలు చేసి తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అతను తెలుగులో పవన్, త్రివిక్రమ్‌ల ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కూడా సంగీతాన్ని అందించాడు. ఇక తమిళంలో అనిరుధ్ పలు క్రేజీ సినిమాలకు సైన్ చేశాడు. సూర్య, విజయ్ వంటి పెద్ద స్టార్ల సినిమాలకు అతను మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే అనిరుధ్ సీనియర్ స్టార్ నయనతారతో కలిసి స్టెప్పులేయబోతుండడం విశేషం. ఇది సినిమా కోసం కాదు… ఓ ప్రమోషనల్ వీడియో సాంగ్ కోసం మాత్రమే. నయనతార కథానాయికగా నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘కొలమావు కోకిల’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోలో అనిరుధ్ కనిపిస్తాడట. దీనిని తెరకెక్కించే ఛాన్స్ నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్‌కు దక్కింది. ఈ సందర్భంగా నయన్‌తో ఓ సెల్ఫీ దిగి దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విఘ్నేష్… ఈ సాంగ్ ప్రోమోలో నయన్‌తో పాటు అనిరుధ్ కనిపిస్తాడని చెప్పాడు. గునిన్ కాదల్… అంటూ సాగే పాట కోసం నయన్‌తో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉందని విఘ్నేష్ చెప్పాడు. ఇక తన ప్రియుడితో కలిసి ఈ పాట చేస్తుండడం తనకు మరచిపోలేని అనుభూతినిస్తోందని నయనతార పేర్కొంది.

Comments

comments