Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

స్విస్‌లో ఆరు ఖాతాలు అనుమానాస్పదం

ubs

 భారతీయులకు చెందిన ఆ ఖాతాల విలువ రూ.300 కోట్లు
 హక్కుదారులెవరో మూడేళ్లుగా వెల్లడించలేదు: స్విస్ బ్యాంక్

జురిచ్/ న్యూఢిల్లీ : నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ చేప్పే స్విస్ బ్యాంక్ ప్రతి ఏడాది ఖాతాదారుల వివరాలను వెల్లడిస్తోంది. అయితే మూడేళ్లుగా భారత్‌కు చెందిన ఆరు ఖాతాలకు చెందిన హక్కుదారులెవరో తెలియడం లేదని స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. భారత్ నుంచి ముగ్గురు, మరో ముగ్గురు ప్రవాస భారతీయులు 2015 నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించలేదని తెలిపారు. స్విస్ బ్యాంక్‌లో భారతీయుల నల్లధనం మరింతగా పెరిగిందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో తాజాగా స్విస్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. స్విస్ బ్యాంకు తొలిసారిగా 2015 డిసెంబరులో స్విట్జర్లాండ్ పౌరులతో పాటు విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల ఖాతాల వివరాలను బహిర్గతం చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది స్విస్ వివరాలను వెల్లడిస్తూ వస్తోంది. 2017లో సుమారు 40 ఖాతాలు వారి వివరాలను సమర్పించిన తర్వాతే వారిని అనధికార జాబితా నుంచి తొలగించామని స్విస్ అంబుడ్స్‌మన్ వెల్లడించింది. 2016 వరకూ స్విస్ బ్యాంకుల్లో భారత్‌కి చెందిన ఖాతాదార్ల సొమ్ము తగ్గుతూ రాగా, 2017 గణాంకాల ప్రకారం బాగా పెరిగి రూ.7,000 కోట్లకు చేరింది. డిసెంబరు 2015లో స్విస్ వెల్లడించిన 3,500 ఖాతాల్లో భారత్‌కు చెందిన ఆరు అనధికారిక ఖాతాలను స్విస్ గుర్తించింది. వీటి విలువ 44 మిలియన్ స్విస్ ఫ్రాంక్(రూ.300 కోట్లు) ఉంటుందని, ఇవి తమ ఖాతాలేనంటూ ఇప్పటివరకూ ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. ఆ ఖాతా తమదేనని దాని యజమానులు ధ్రువపత్రాలతో నిరూపించుకోవాల్సి ఉంటుందని స్విస్ పేర్కొంది. ఆరుగురిలో ముగ్గురు భారతీయులుగా చెప్పారు. మరో ముగ్గురు ప్రవాస భారతీయులు.. వీరిలో ఒకరు ప్యారిస్(ఫ్రాన్స్), మరో లండన్‌లో నివసిస్తుండగా, మరొకరు నివాస వివరాలను వెల్లడించలేదు.

Comments

comments