Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

దర్జాగా భూ కబ్జా!

Six acres of land in the survey number 153

l పెద్ద చింతకుంటలోని సర్వే నెంబర్ 153లో ఆరెకరాల భూమి కబ్జా
l పెద్దమనుషుల అండదండ లు, అధికారుల సహాకారం తో అక్రమం
l భూప్రక్షళనంలో సైతం వెలుగు చూడని వైనం!
l భూ అక్రమదారుడికే అప్ప గించేందుకు అధికారుల ప్రొసీడింగ్ సిద్ధం
l ఆర్‌ఐ విచారణ చేపడతా మంటున్న తహసీల్దార్

మనతెలంగాణ/నర్సాపూర్ :  పెద్ద మనుషుల అండదండలు, అధికారుల సహకారం ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా దర్జాగా కబ్జా  చేయొచ్చు. భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూప్రక్షాళనలో సైతం భూఅక్రమాలు వెలుగులోకి రాకపోవడం విశే షం. భూ అక్రమార్కులు మాత్రం పెద్దమనుషు ల అండదండలతో సంబంధిత అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పడంతో, అధికారుల సైతం భూ కబ్జాదారులకే అట్టి భూములను కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం నిజం. అందుకు నిదర్శనమే పెద్దచింతకుంట శివారులోని 153 సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల అసై న్డ్ ప్రభుత్వ భూమి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంలోని 153 సర్వే నెంబర్‌లో మొత్తం ప్రభుత్వ భూమి. ఈ భూమిని గతంలో  మూడు కుటుంబాలకు చెందిన గుర్రాల కాష్టయ్యకు 1.50 ఎకరాలు, గుర్రాల కుషలయ్యకు 1.50 ఎకరాలు, గుర్రాల బుచ్చయ్యకు మూడు ఎకరాల భూమిని అసైన్డ్‌మెంట్ కింద చాల సంవత్సరా ల క్రితం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే గుర్రాల కిష్టయ్యకు, కుషలయ్యలకు వారసులు లేరు.

ప్రభుత్వ నిబంధనాల ప్రకారం అట్టి భూ మిని రెవెన్యూ అధికారులు ఖారీజ్ ఖాతాగా రి కార్డులో నమోదు చేయాలి. అయితే అట్టి భూమి పై అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి , ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటూ ఆర్థికంగా బలపడిన బడాబాబు, గత పది సంవత్సరాల క్రితం, అప్పటి స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, అతడి భార్య పేరున భూమిని సొంతం చేసుకున్నాడు. అసైన్డ్ భూమి ని సొంతం చేసుకున్నదే కాకుండా, దాని ప్రక్కనే గల దూసల గుట్టలోని మూడెకరాల భూమిని ఆక్రమించి మొత్తం ప్రభుత్వ భూమి చుట్టూ హద్దురాళ్ళు పాతడం విశేషం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భూపరిరక్షణ పేరుతో చేపట్టినా భూప్రక్షాళనలో 153 సర్వేనేంబర్‌లో కబ్జాకు గు రైనా 6 ఎకరాల భూమి అధికారుల దృష్టికి రాకపోవడం, అంతేకాకుండా అధికారులు గుట్టు చప్పుడు కాకుండా భూ కబ్జాదారుల పేరునే ప్రొసిడింగ్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రభు త్వ భూములు వివాదాస్పదంగా ఉంటే భూప్రక్షాళనంలో పార్టు -బీ కింద నమోదు చేసిపక్కన పెట్టాల్సి ఉండగా, అధికారులే ప్రొసీడింగ్ ఇవ్వడంతో పలు విమర్శలకు తావిస్తోంది. ఈ భూఆక్రమణలో కొందరు రెవెన్యూ అధికారులే మధ్య వర్తులుగా ఉండి, ఆమ్యామ్యాలు అందిపుచ్చుకు ని వ్యవహరం నడిపినట్టుగా వినికిడి. నర్సాపూర్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న పెద్దచింతకుంట గ్రామంలోని 153 సర్వేనెంబర్‌లోని ఆ క్రమణకు గురైనా ఆరు ఎకరాల భూమి, ప్రస్తు తం ఎకరం రూ.2030 లక్షల్లో ధర పలకడం చూస్తుంటే సుమారు రెండు కోట్ల విలువగల ప్ర భుత్వ భూమిని బడాబాబు స్వాహా చేశాడన్నది నిజం. ఈ ప్రభుత్వ భూమి హైదారాబాద్ -బోధ న్ ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉండ టం, ప్రస్తుతం ఈ ప్రధాన రోడ్డు జాతీయ రహదారిగా మారనున్న తరుణంలో ఇట్టి భూమి విలువ మరింత పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం తెలిసిన కొందరు గ్రామస్థు లు అట్టి భూమిపై సమగ్రంగా సర్వే చేయించి, ప్రభుత్వమే స్వాధీన పర్చుకోవాలని అంటున్నారు. విలువైన ప్రభుత్వ భూములను కాపాడుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు వినియోగించే అవకాశముంటుందని ఈ సందర్భం గా వారు పేర్కొంటున్నారు.
ఆర్‌ఐతో విచారణ చేపడతాం : పెద్దచింతకుం టలోని 153 సర్వే నెంబర్‌లో కబ్జాకు గురైనా భూ విషయంపై తహసీల్దార్ మనోహర్‌చక్రవర్తి ని వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని, త్వరలోనే ఆర్‌ఐ చేత సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

comments