Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు… ఆరుగురి అరెస్టు

ARREST-2రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తూ, దేశ రాజధాని ఢిల్లీ నుంచి యువతులను రప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఒటి పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజరాహిల్స్‌కు చెందిన రంజిత్ కొంతకాలంగా ఢిల్లీ నుంచి యువతులను రప్పిస్తూ ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఒటి పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రంజిత్ ఢిల్లీ నుంచి ఇద్దరు యువతులను రప్పించాడు. ఆన్‌లైన్‌లోనే బంజరాహిల్స్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ప్రభాకర్, రవివర్మ, టోనిలకు సమాచారం అందించ్చాడు. ఆదివారం రామంతాపూర్ రావాలని సూచించాడు. అతడితో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు, ఈ ముగ్గురు విటులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మాటువేసి ఉన్న ఎస్‌ఒటి పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

Comments

comments