Home తాజా వార్తలు నిర్బంధ తనిఖీలు…

నిర్బంధ తనిఖీలు…

Police checks in Hyderabad

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి మున్సిపల్ కాలనీ, విద్యుత్ నగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. ఎల్‌బినగర్ డిసిపి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 11 ఆటోలు, 30 ద్విచక్రవాహనాలు, 9 సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆరుగురు పాత నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.