Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టాప్ 10లో ఆరు కంపెనీలకు నష్టాలు

  • మార్కెట్ విలువ రూ.34,183 కోట్లు తగ్గింది
  • భారీగా నష్టపోయిన ఐటి దిగ్గజం టిసిఎస్

TCS-Top-10

ముంబయి : గత వారం టాప్-10 బ్లూచిప్ కంపెనీల్లో ఆరు సంస్థల మార్కెట్ విలువ(ఎం-క్యాప్) రూ.34,182. 73 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. దీనిలో ఐటి దిగ్గజం టిసిఎస్ అత్యంత నష్టపోయింది. పది కంపెనీల్లో టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యుఎల్, మారుతీ, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి వంటి సంస్థలు మార్కెట్ విలువను కోల్పోయా యి. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, ఎస్‌బిఐ వంటి సంస్థల ఎం-క్యాప్ రూ. 30,203.08 కోట్లు పెరిగింది. టిసిఎస్ మార్కెట్ విలువ రూ.22,226.42 కోట్లు కోల్పోయి రూ.4,72,400.25 కోట్లకు చేరగా, జాబితాలో అత్యంత నష్టపోయిన సంస్థ ఇదే. ఆ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా ఎం-క్యాప్ రూ.5,576.4 కోట్లు పడిపోయి రూ.2,19,503.45 కోట్ల కు చేరగా, ప్రభుత్వరంగ సంస్థ ఒఎన్‌జిసి విలువ రూ.2, 951.64 కోట్లు తగ్గి రూ.2,14,122.53 కోట్లకు చేరింది. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ.1,872.01 కోట్లు తగ్గి రూ.2,16,027.65 కోట్లకు చేరింది. హెచ్‌యుఎల్ మార్కెట్ విలువ రూ.789.75 కోట్లు పడిపోయి రూ.2, 36,262.13 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.766.51 కోట్లు తరిగిపోయి రూ. 2,60,661.37 కోట్లకు చేరింది. మరోవైపు ఆర్‌ఐఎల్ ఎం-క్యాప్ రూ.17,021.26 కోట్లు పెరిగి రూ. 4,51,250.35 కోట్లకు చేరింది. ఎస్‌బిఐ మార్కెట్ విలువ రూ.12,777.78 కోట్లు పడిపోయి రూ.2,46,747.16 కోట్లకు చేరగా.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ.282.57 కోట్లు పెరిగి రూ.4,28,478.90 కోట్లకు చేరింది. ఐటిసి విలువ రూ.121.47 కోట్లు పెరిగి రూ.3,72,074.34 కోట్లకు చేరింది. టాప్-10 ఎం-క్యాప్ ర్యాంకింగ్‌లో ఇప్పటికీ ముందు వరుసలో టిసిఎస్ సంస్థే ఉంది. ఆ తర్వా త స్థానాల్లో వరుసగా ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, హెచ్‌యుఎల్, మారుతీ, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి సంస్థలు ఉన్నాయి.

Comments

comments