Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నిండుతున్న సాగర్

 Six crest gates of Srisailam dam opened

శ్రీశైలం ఆరు గేట్ల నుంచి కిందికి నీరు
పెరుగుతున్న నాగార్జునసాగర్ మట్టం
చాలాకాలం తర్వాత జలకళ
ప్రస్తుత సాగర్ నీటి మట్టం 540 అడుగులకు చేరువ, పూర్తిస్థాయి 590 అడుగులు

మన తెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం కంటే కొంత తగ్గినప్పటికీ, రిజర్వాయర్ పూర్తిస్థాయి మట్టానికి చేరడంతో వచ్చిన నీటిని, వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. దీంతో చాలా కాలం తర్వాత సాగర్ జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆదివారం 6 గేట్లు ఎత్తి 2.65 లక్షల క్యూ సెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. శనివారం నాడు 8 గేట్లు ఎత్తగా, నీటి ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు మూసివేశారు. శ్రీశైలంకు చేరుతున్న ఇన్‌ఫ్లో 2.90 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల వరకు నీరు చేరింది. 215.8 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థానికి గాను ఇప్పుడు 200 టిఎంసిల మేర నీరు నిల్వ ఉంది.

నాగార్జునసాగర్‌కు 2.35 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరుతోంది. 590 అడుగుల్లో 312 టిఎంసిల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 540 అడుగులకు చేరువగా ఉంది. 190 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత ఫ్లో కొనసాగితే వారం రోజుల్లో సాగర్ నిండే అవకాశం ఉంది. ఇంకా 125 టిఎంసిల నీరొస్తే సాగర్ గేట్లు ఎత్తా ల్సి వస్తుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు 1.3 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యాంకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 76 వేల క్యూసెక్కు లు దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్‌లో ఉజ్జయి ని రిజర్వాయర్‌కు 25 టిఎంసిలు, నాగార్జునసాగర్‌కు 125 టిఎంసిలు, పులిచింతలకు 44 టిఎంసిల ప్రవా హం వచ్చి చేరితే బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ పూర్తిస్థాయిలో నిండినట్లే. కర్ణాటకలో ఇంకా వర్షం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి బేసిన్‌లో ఎల్లంపల్లికి 29,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 21800 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Comments

comments