Home జాతీయ వార్తలు రైలు ఢీ : ఆరు ఏనుగులు మృతి

రైలు ఢీ : ఆరు ఏనుగులు మృతి

ELEPHANT

అసోం : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి చెందాయి. ఈ ఘటన సోనిట్‌పూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. గుహవాటి – నాహర్‌లాగుస్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఏనుగులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఓ పిల్ల ఏనుగు కూడా ఉంది. ఏనుగుల మృతదేహాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

 Six Elephants killed in Train Accident