Home తాజా వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు దుర్మరణం

Six killed in Lorry Collision with Auto in West Godavari district

అమరావతి: ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శివారులో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు నలుగురు మహిళలు ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతులను కాకినాడ రూరల్‌ మండలం రామేశ్వరానికి చెందిన నాగమణి(35), మంగ(36), లక్ష్మి(35), కమల(35), పండు(03), ఆటో డ్రైవర్‌ జోగేంద్ర (50)గా గుర్తించారు. పెద్దాపురం మండలం వడ్లమూరులో శుభకార్యక్రమంకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదంపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.