Search
Monday 24 September 2018
  • :
  • :

ఆ బిజినెస్‌లో మనమే నెం.1…

KTR

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో హైదరాబాదే నెంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఫెర్రింగ్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు కెటిఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లైఫ్ సెన్సెస్‌లో ప్రత్యక్షంగా రెండు లక్షల మంది పరోక్షంగా నాలుగు లక్షల మంది పని చేస్తున్నారని, రానున్న పదేళ్లలో లైఫ్ సెన్స్‌స్‌లో ఉపాధి అవకాశాలు రెండు రేట్లకు పెరుతాయని వివరించారు. 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఫార్మా రంగంలో హైదరాబాద్ నుండే అత్యధిక ఎగుమతులు జరుగుతున్నాయని కొనియాడారు. మెడికల్ డివైజెస్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశామని, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

Comments

comments