Home జాతీయ వార్తలు ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌… ఆరుగురి మృతి

ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌… ఆరుగురి మృతి

gas-like-6-mem
అనంతపురం: తాడిపత్రిలోని గెరుడౌ ఉక్కు కర్మాగారంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో ఒక్కసారిగా గ్యాస్‌ లీకై ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు.వారిని తక్షణమే తాడిపత్రి ఏరియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కర్మాగార సిబ్బందికి వైద్యసేవలను అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఈ సంఘటన ఎలా జరిగిందన్నవిషయంపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. యాజమాన్యం కర్మాగారంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధితకుటుంబాలను ఆదుకోవాలని కర్మాగారంలో రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.