Home తాజా వార్తలు మార్కెట్ విలువ రూ.34,590 కోట్లు ఆవిరి

మార్కెట్ విలువ రూ.34,590 కోట్లు ఆవిరి

Reliance Industries Ltd.

గత వారం టాప్ 10లో ఆరు సంస్థలకు నష్టాలు

ముంబై: గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఆరు సంస్థల మార్కెట్ విలువ(ఎంక్యాప్) రూ.34,590 కో ట్లు ఆవిరైంది. మార్కెట్లు నష్టాలను మూటగట్టుకోవడమే దిగ్గజ కంపెనీల నష్టాలకు కారణం. టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్), ఐటిసి, ఎస్‌బిఐ, కోటక్ మహీంద్రా బ్యాం క్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు మార్కెట్ విలువను కోల్పోయా యి. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్‌లు లా భాలను నమోదు చేశాయి. ఎస్‌బిఐ ఎంక్యాప్ రూ. 9,727 కోట్లు తగ్గి రూ.3,04,909 కోట్లకు చేరగా, ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.9,159 కోట్లు కోల్పోయి రూ.8,33,773 కోట్లకు చేరింది. టిసిఎస్ విలువ రూ.6,716 కోట్లు కరిగిపోయి రూ.8,17,625 కోట్లకు చేరింది.

ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.4,224 కోట్లు తగ్గి రూ.2,68,847 కోట్లకు చేరగా, ఐటిసి మార్కెట్ విలువ రూ.3,371 కోట్లు కోల్పోయి రూ.3,38,215 కోట్లు అయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంక్యాప్ రూ.1,389 కోట్లు తగ్గి రూ.2,88,708 కోట్లకు చేరింది. వీటికి విరుద్ధంగా హెచ్‌యుఎల్ ఎంక్యాప్ రూ.10,055 పెరిగి రూ.3,96,504 కోట్లకు చేరగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ.7,211 కోట్లు పెరిగి రూ.6,68,007 కోట్లు అయింది. హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.4,614 కోట్లు పెరిగి రూ.3,80,389 కోట్లకు చేరింది. ఇక ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ.1,092 కోట్లు పెరిగి రూ.3,23,016 కోట్లు అయింది. టాప్ 10 ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.

Six of top 10 most valued firms lose Rs 34,590 crore