Home తాజా వార్తలు బస్సు ప్రమాదంలో ఆరుగురి మృతి

బస్సు ప్రమాదంలో ఆరుగురి మృతి

Bus-Accident

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో సాంబాల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గున్నార్ అనే గ్రామంలో బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటన స్థలంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సాంబాల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొగ మంచు ఎక్కువగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  ప్రాథమిక అంచనాలకు వచ్చారు. ట్రాపిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

Six People Dead in Bus Accident in Uttar Pradesh

Telangana news