Home తాజా వార్తలు కూలిన భవనం: ఆరుగురి మృతి

కూలిన భవనం: ఆరుగురి మృతి

Building-collapsed-in-UP

లక్నో: ఐదు అంతస్థుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారాపూర్ లో శనివారం జరిగింది. వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో  ఇళ్లు గొడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఐదు అంతస్థుల భవనం కూలిపోవడంతో నిద్రలో ఉన్నవారు అలానే కన్నుమూశారు.  మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లు కూలిపోయిందని అధికారుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.