Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఆరేళ్ల చిన్నారి అదృశ్యం

Six years child girl missing

బాచుపల్లి: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరు సంవత్సరాల చిన్నారి కనిపించకుండా పోయిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్సెక్టర్ బాలకృష్ణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా పాపన్నపేటలో లింగం, నాగమణి దంపతులు కూతురు ఎల్లవ్వ.ఇద్దరు భార్య భర్తాలు వారి కూతురు ఆరేళ్ల ఎల్లవ్వతో కలిసి బ్రతుకు దేరువు కోసం నిజాంపేటలో సాయిబాబా గుడి వద్ద నివాసముండే నాగమణి తల్లి వద్దకు వచ్చారు. అయితే శుక్రవారం నుండి బాలిక కనిపించకుండా పోయిది. బాలిక తల్లిదండ్రులు ఎంత వెదికినా చిన్నారి దొరకకపోవడంతో వారు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం గురు పౌర్ణిమ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున సాయిబాబా గుడి వచ్చారని జనాల్లో బాలికను తీసికెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని సిసి కెమెరాల పుటేజిని పరిశీలీస్తున్నారు.

Comments

comments