Search
Monday 24 September 2018
  • :
  • :

ఐఫోన్-5ఎస్‌కు మెరుగులు

i-phoneన్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ ఉన్న ఐఫోన్-6లో ఉన్న స్పెషల్ ఫీచర్లను 5ఎస్ లోనూ అమర్చాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది. దీనిని మార్చి నెలలో తీసుకురావాలని ప్రయత్నిస్తో ంది. యాపిల్ ఐఫోన్-5 ఎస్‌కు మరిన్ని మెరుగు లు దిద్దుతోంది. ఈ ఫోన్‌లో స్వల్పంగా డిజైన్ మార్పులు కూడా ఉంటాయని సంస్థ పేర్కొంటోంది. దీనిని ఐఫోన్-5ఎస్‌ఈగా పిలవనున్నా రు. 5ఎస్ తరహాలో నాలుగు అంగుళాల పొడవు ఉన్న కొత్త ఐఫోన్‌ను వచ్చే మార్చి నెలలో మార్కె ట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆపిల్ ప్లే యాప్ పనిచేసేవిధంగా ఎన్‌ఎఫ్‌సీ చిప్, ఎ8 ప్రాసెసర్‌తోపాటు కనెక్టివిటీకి సంబంధించి వైఫై వంటి ఫీచర్లు మరింత మెరు గవ్వనున్నాయని ’వర్జ్’ మీడియా సంస్థ తెలిపింది. లైవ్ ఫోటో ఫీచర్‌ను సపోర్ట్ చేసే ఈ మోడల్ మార్చి నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశ ముందని సమాచారం.

Comments

comments