Search
Monday 24 September 2018
  • :
  • :

కోల్‌కతాలో నవజాత శిశువుల మృతదేహాల కలకలం

Skeletons of 14 newborn babies wrapped in plastic bags

కోల్‌కతా: ప్లాస్టిక్ సంచుల్లో నవజాత శిశువుల మృతదేహాలు లభ్యం కావడం కోల్కతాలో కలకలం రేపింది. దక్షిణ కోల్కతాలోని ఓ ఖాళీ ప్రదేశంలో  గుర్తించారు. మున్సిపల్ కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ కోల్కతాలోని హరిదేవ్ పూర్ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం మున్సిపల్ కార్మికులు పనులు చేపట్టారు. పచ్చిక కలిగిన ఓ ఖాళీ స్థలంలో వారికి ప్లాస్టిక్‌ సంచులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే కొన్ని మృతదేహాలు సగానికిపైగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని తెలిపారు.  ఈ ఘటనాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments