Search
Wednesday 14 November 2018
  • :
  • :

కాసేపైతే ఓకే..!

skills increase in young children are due to cartoons

చంటి పిల్లల దగ్గర నుంచి స్కూళ్లకెళ్లే వారివరకూ కార్టూన్ నెట్‌వర్క్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. రోజులో కొంత సమయం వరకైతే ఫరవాలేదు. కానీ అదే లోకంగా మారితే చదువు, నిద్ర.. అన్నీ అటకెక్కుతాయి. కానీ చూడకుండా వారిని ఆపలేం. తిడుతూ ఉన్నా పట్టించుకోరు పిల్లలు. కానీ కొంతసేపు   కార్టూన్ నెట్‌వర్క్‌ను చూడటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. పిల్లలపై వాటి ప్రభావం ఏ విధంగా పడుతుందో వివరిస్తున్నారు… 

చిన్న పిల్లలు కార్టూన్లు చూడటం వల్ల వాళ్లలో భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదాలు ఎలా పలకాలో సులువుగా నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా వాళ్లలో ఇంగ్లిష్‌పై పట్టు పెరుగుతుంది.

1. వాళ్లకిష్టమైన కార్టూన్ పాత్ర చేసే పనిని తాము కూడా చేయాలన్న ఆసక్తి పిల్లల్లో పెరుగుతుంది. అందుకే హింసా, కోపం… లాంటివి కాకుండా తెలివితేటలు పెంచే కార్టూన్ కార్యక్రమాలను తల్లిదండ్రులే ఎంపిక చేయండి. దానికే వాళ్లు కూడా అలవాటు పడతారు.

2. కార్టూన్ల ప్రభావం పిల్లల ఆలోచనా శక్తి మీద కూడా ఉంటుంది. కార్టూన్లు ఎక్కువగా చూసేవారు మిగతా పిల్లలతో పోలిస్తే కళాత్మకంగా ఆలోచించగలుగుతారట. అంతేకాదు స్కూళ్లో పాఠాలు గుర్తుపెట్టుకునే శక్తి పెరుగుతుందట.

3. ఇప్పటి పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయడం కాస్త కష్టమే. చుట్టూ ఉన్న కంప్యూటర్లూ, ఫోన్లు వాళ్ల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటప్పుడు కార్టూన్లు ఒక మంచి మార్గం. వారికిష్టమైన కార్టూన్లకు సంబంధించిన కామిక్ పుస్తకాలేమైనా ఉంటే తెచ్చి వారికివ్వండి. వాటి వల్ల పుస్తకాలమీద కూడా ఆసక్తి పెరుగుతుంది.

4. టీవీలో రెండు పాత్రలు మాట్లాడుకుంటున్న తీరు నుంచి రకరకాల సంభాషణలు తెలుసుకోగలుగుతారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కాస్తైనా వాటి నుంచి నేర్చుకుంటారు. అవి పదాలు పలుకుతున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు పిల్లలు కూడా వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు.

5. అయితే.. లాభాలున్నాయి కదా అని వాటిని అతిగా అలవాటు చేయాలనుకోకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉండాలి. టీవీ చూసే విషయంలో సరైన నిబంధనలు పెట్టుకోండి. వాటిని పక్కాగా అమలయ్యేలా చూసుకోండి. లేదంటే పిల్లలు టీవీలకే అతుక్కుపోతారు.

Comments

comments