Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చలిలో… చర్మ సంరక్షణ

skinచలి రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో పిల్లలకూ, పెద్దలకూ చర్మం పొడిబారడం, తెల్లగీతలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. ఈ చలిపులి బాధ నుంచి చర్మాన్ని మన ఇంట్లోనే దొరికే వాటితో కాపాడుకోవచ్చు. అది ఎలాగంటే…..
పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజు స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బులో గాఢత ఎక్కువ ఉన్న రసాయనాలు ఉండడం వల్ల అది

చర్మాన్ని మరింత పాడు చేస్తుంది. అందుకే రెగ్యులర్ సబ్బును కాకుండా సోప్ ఫ్రీ బాత్ జెల్‌ను ఉపయోగించడం మంచిది. సున్నిపిండితో స్నానం ఉత్తమం. స్నానానికి వాడే నీటి విష యంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. మరీ వేన్నీళ్ళు కాకుండా గోరువెచ్చటి, లేదంటే చల్లని నీటిని స్నానానికి ఉపయోగించాలి. స్నానం పూర్తయిన వెంటనే అంటే తడి మీదనే బాడీ లోషన్‌ను చర్మానికి రాయాలి. అప్పుడే చర్మం పొలు సులుగా రాకుండా నివారించవచ్చు. చర్మంపై దురదలాగా అనిపించడం, ముడతలు పడి కోసుకున్నట్లు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. పాకంతో తయారుచేసిన తేనె నీటిలో వెంటనే కరిగిపోతుంది.
పెదాలు పగిలినప్పుడు మజ్జిగ చిలికిన వెన్న రాస్తే త్వరగా పెదాలు పగుళ్ళు తగ్గుతాయి.
తమలపాకు రసం, రెండు తేనె చుక్కలు కలిపి రంగరించి పెదాలకు రాసి, గంట తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే వారం రోజుల్లో పెదవులు మృదువుగా మారతాయి.

Comments

comments