Search
Wednesday 26 September 2018
  • :
  • :

మాయిశ్చరైజర్‌తో చర్మానికి సంరక్షణ

skinచలికాలం మొదలైంది. చర్మం చిటపటలాడుతున్నట్లు అనిపిస్తుంది. చలి పెరుగుతున్న కొద్దీ చర్మం రంగు, రూపు మారిపోతుంది. చర్మానికి కొంత సంరక్షణ తీసుకుంటే సరిపోతుంది.
ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. లేదంటే చర్మం బిగుసుకుపోయినట్లు అవుతుంది. రాత్రి పడుకునే ముందు కూడా మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది.
మార్కెట్‌లో లభించే మాయిశ్చరైజర్ క్రీములకు బదులు వెన్న, వేరుశనగ నూనెతో కూడా మసాజ్ చేసుకోవచ్చు. పావుగంట తర్వాత స్నానం చేయాలి.
రాత్రి పూట చలిగా ఉంటుంది. కనుక స్వెట్టర్ వాడటం ఉత్తమం. బండి మీద ప్రయాణం చేసేటపుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు వాడాలి. దీనివల్ల ఒంటికి నేరుగా చల్లగాలి తగలదు.
ఇంట్లో ఉన్నప్పుడు పెదాలకు వెన్న , తేనె రాసుకోవాలి. బయటకు వెళ్లేటపుడు బ్యాగ్‌లో లిప్‌బామ్ వెంటబెట్టుకోవాలి. వీటన్నింటితోపాటు నీళ్లు ఎక్కువగా తాగాలి.

Comments

comments