Home హైదరాబాద్ ఆబ్కారీలో అవినీతిపై కొరడా!

ఆబ్కారీలో అవినీతిపై కొరడా!

slap-on-corruption-in-the-abkari

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఆబ్కారీ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆబ్కారీ కార్యాలయాల్లో, ఎక్సైజ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెల ప్రభుత్వం నుంచి వేలల్లో జీతభత్యాలు పొందుతున్న కొంతమ ంది అధికారులు,సిబ్బంది అవినీతికి పాల్పడుతూ ఆక్రమ సంపాదన కూడ కట్టుకుంటున్నట్లు ఉన్నతాధికారులకు, అవినీతి నిరోధక శాఖాధికారులకు(ఏసీబీ) పె ద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ మేరకు ఫిర్యాదులపై స్పం దించిన ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులు, ఏసీబీ అధికారులు సంయుక్తంగా రం గంలో దిగి ఆక్రమార్కులకు ఆగడాలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆక్రమాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన జాబితాను తయా రు చేసినట్లు తెలిసింది. అయితే జాబితా ఆధారంగా అవినీతి అధికారులపై చర్య లు తీసుకోవడానికి రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. ఆక్రమ ఆస్తులు కూడ బె ట్టిన కేసులో హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వహించి నిజామాబాద్ కు బదిలీపై వెళ్లిన ఈ ఎస్ జ్యోతి కిరణ్‌ను ఏసీబీ అధికారులు గత ఏడాది అరెస్టు చేసిన విష యం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీ నివాసులు లంచం తీసుకుం టూ ఎసీబీ అధికారులకు అ డ్డంగా దొరికాడు. మాన్సాన్‌పల్లికి చెందిన పబ్బ రాఘవే ందర్‌గైడ్ వద్ద లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు.. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల పరుధుల్లోని ఎక్సైజ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లపై సైతం ఆబ్కారీ ,ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. సదరు అధికారులు తమ తమ ఏరియాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్‌షాపులు,బెల్ట్‌షాపుల నుంచి పె ద్ద ఎత్తున మాముళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. సదరు అధికారులు తమ ఆ ప్తులైన కానిస్టేబుళ్లను కలెక్టర్లుగా నియమించుకుని వారితో మమూళ్ల పర్వాన్ని కొనసాగిస్తునట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. అయితే తమకు అందిన ఫిర్యాదుల మేరకు పై స్ధాయి నుంచి క్షేత్రస్ధాయి వరకు ఆక్రమార్కులపై కొరడా ఝళిపించడానికి ఏసీబీ కసరత్తు చేస్తోంది.