Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

GOLD_BANGLES_1103391fన్యూఢిల్లీ : రెండు నెలల గరిష్ఠం నుంచి బంగారం ధర స్వల్పంగా దిగివచ్చింది. శుక్రవారం రూ.250 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,650కి చేరింది. నగల వ్యాపా రుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో డిమాండు తగ్గడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్ని ప్రభావితం చేసే సిం గపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,098.12 అమెరి కన్ డాలర్లుగా ఉంది. అలాగే శుక్రవారం వెండి ధర కూడా తగ్గింది. రూ.250 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,400కి చేరింది. పారిశ్రా మిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించ డంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Comments

comments