Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

చిన్న సినిమాలను చిన్నచూపు చూస్తున్నారు

Suresh-babuరానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ కంచెరపాలెం’. రాధా బెస్సి, కేశవ, కార్తీక్ తదతరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన సక్సెస్‌మీట్‌లో డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ “చిన్న సినిమాల ను చిన్నచూపు చూస్తున్నారు. అయితే చిన్న సినిమా అయిన కేరాఫ్ కంచెరపాలెం చిత్రాన్ని సెలబ్రిటీస్, ఫిలిం లవర్స్‌కు చూపించాం. సిని మా చూసిన అందరూ బావుందని ప్రేక్షకుల్లోకి ఈ చిత్రా న్ని తీసుకెళ్లారు. అమెరి కా నుండి వచ్చిన ప్రవీణ… వెంకటేశ్ మహా అనే కొత్త అబ్బాయితో ధైర్యంగా ఈ సినిమా చేసింది. తొలిసారి దర్శకత్వం వహించినప్పటికీ అతను సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ను చక్కగా తీర్చిదిద్ది సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో నటించిన వారందరూ కొత్తవారైనా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ కావాలి”అని అన్నారు. మహా వెంకటేశ్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం నటీనటులు చాలా కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు ఎంతగానో సహకరించా రు. కంచరపాలెంను నేను ఎలా చూపించాలనుకున్నానో అలాగే సినిమాలో కనపడుతుంది. ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్‌తో తెరకెక్కించాలని అనుకుంటున్న సమయంలో విజయ ప్రవీణ పరిచయ మై నిర్మాతగా నాకు అండగా నిలబడ్డారు. సురేశ్‌బాబు, రానా మాకు అండగా నిలబడడంతో ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు వెళ్లగలిగింది”అని తెలిపారు. విజయ ప్రవీణ, మోహన్ భగత్, కార్తీక్, వెంకట్ సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments