Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రూపాయిపై కేంద్రం జోక్యం అవసరం లేదు

bs

 ఇప్పటికీ 57 శాతం అధిక విలువతో కరెన్సీ : నీతి ఆయోగ్

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇప్పటికీ 5 నుంచి 7 శాతం అధిక విలువను కల్గి ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 7 శాతం అధిక విలువతో ఉన్న నేపథ్యంలో మార్కెట్‌లో కేంద్రం జోక్యం అవసరం లేదని అన్నా రు. గత గురువారం రూపాయి విలువ 69 స్థాయికి పడిపోయి జీవనకాల కనిష్టానికి చేరింది. ఈ ఏడాది లో ఆసియాలో రూపాయి అత్యంత ధారుణంగా పతనమైంది. దేశంలో ద్రవ్యోల్బణం అంతర్జాతీయ రేటు కంటే ఎగువ స్థాయిలో ఉందని, అదే వాస్తవ మారక రేటును నిర్ణయిస్తుందని రాజీవ్ కుమార్ అన్నారు. వాస్తవ మారక విలువ మంగళవారం 5 నుంచి 7 శాతం అధిక విలువతో 69 లేదా 68.97 వద్ద ఉందని తెలిపారు. రూపాయి విషయంలో ప్రభుత్వం జోక్యం అవసరం లేదని అన్నారు. ఆర్‌బిఐ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని, రూపాయిని కాపాడేందుకు మార్కెట్‌లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోబోదని అన్నారు. కాగా రూపాయి విషయంలో కేంద్ర జోక్యం చేసుకోవాలని మూడు రోజుల క్రితం అసోచామ్ కోరింది. రూపాయి మరింతగా క్షీణించకుండా నియంత్రించేందుకు ఆర్‌బిఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలు కలిసి చర్యలు చేపట్టాలని చెప్పింది. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుని అమెరికా ఆంక్షలకు దిగడం, స్వల్పంగానే చమురు ఉత్పత్తికి ఒపెక్ అంగీకరించడం వంటి అంశాలు రూపాయిపై ప్రభావం పడకుండా ఆర్‌బిఐ తగు చర్యలు తీసుకోవాలని అసోచామ్ పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69కి చేరి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. పెరిగే చమురు ధరలతో రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉందని, విదేశీ మారకం నిల్వలు మెరుగ్గా ఉన్నందున రూపాయి అస్థిరతకు చెక్ పెట్టాలని సూచించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్ కరెన్సీ 7 శాతంపైగా పతనమైంది. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణం కాగా, వచ్చే రోజుల్లోనూ రూపాయి మరింతగా బక్కచిక్కే అవకాశముందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డాలరుతో మారకంలో రూపాయి 70ను తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
6872 మధ్య స్థాయిలోనే రూపాయి: యుఎస్‌బి సెక్యూరిటీస్
స్వల్ప కాలికంగా డాలర్‌తో రూపాయి విలువ 6872 మధ్య స్థాయిలోనే కదలాడే అవకాశముందని యుఎస్‌బి సెక్యూరిటీస్ అంచనా వేసింది. అయితే అ స్థిర పరిస్థితులను నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాం క్ జోక్యం చేసుకునే అవకాశముందని పేర్కొంది.

Comments

comments